షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర ప్రారంభమవుతుంది

  • వైయస్ జగన్ ను జనం నుంచి దూరం చేయలేరు
  • త్వరలోనే పాదయాత్ర రూట్ మ్యాప్ విడుదల చేస్తాం
  • వైయస్ జగన్ ను చూసి టీడీపీ భయపడుతోంది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ః వైయస్ జగన్ ను జనం నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్ నిరంతరం ప్రజల్లోనే ఉంటారని చెప్పారు.  కోర్టు తీర్పుకు లోబడి వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. త్వరలోనే పాదయాత్ర రూట్ మ్యాప్ విడుదల చేస్తామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వైయస్ జగన్ ను చూసి టీడీపీ భయపడుతోందన్నారు. అందుకే పాదయాత్ర ఎలా చేస్తారంటూ టీడీపీ నేతలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.  పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రలో వైయస్ జగన్ ప్రదలందరినీ కలుస్తారని చెప్పారు. 
Back to Top