ప్రజాసమస్యలు..పాదయాత్రపై చర్చ

హైదరాబాద్‌: పార్టీ సీనియర్‌ నేతలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో తాను ప్రారంభించనున్న పాదయాత్ర, రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, చంద్రబాబు విదేశీ పర్యటన, మెడికల్‌ సీట్ల విషయంలో బీసీలకు, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం వంటి వివిధ అంశాలపై చర్చించారు. అదే విధంగా నవంబర్‌ రెండో వారంలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలపై చర్చించారు. అదే విధంగా పార్టీకి సంబంధించిన ఇతర అంశాలపై కూడా చర్చించారు. పార్టీ సీనియర్‌ నేతల సలహాలు, సూచనలు తీసుకున్నారు.

తాజా ఫోటోలు

Back to Top