చంద్రగిరిలో అధినేతకు ఘనస్వాగతంవివాహ కార్యక్రమానికి హాజరునూతన జంటను ఆశీర్వదించిన జననేత
చిత్తూరు(తిరుపతి): ప్రతిపక్షనేత, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘనస్వాగతం లభించింది. శుభకార్యానికి హాజరయ్యేందుకు జిల్లాకు వచ్చిన జననేత.... ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరికి చేరుకున్నారు. ఈసందర్భంగా వైయస్ జగన్ కు పార్టీ నేతలు, అభిమానులు అపూర్వస్వాగతం పలికారు.
స్థానిక వైయస్‌ఎంఆర్ కల్యాణ మండపంలో బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను వైయస్ జగన్ ఆశీర్వదించారు. మధ్యాహ్నం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.
భారీ ఏర్పాట్లుచంద్రగిరి నియోజకవర్గానికి వైయస్ జగన్ రాక నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. మధ్యమధ్యలో పార్టీ అధినాయకునికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, అధిక సంఖ్యలో కటౌట్లను ఏర్పాటు చేశారు.