బతుకులు బాగుపడాలంటే జననేత సీఎం కావాలి

  • లోటస్‌పాండ్‌లో దొరికిన ఆదరణ, అభిమానం ఎనలేనిది
  • బాబు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే
  • వైయస్‌ఆర్‌ సువర్ణ పాలన వైయస్‌ జగన్‌తోనే సాధ్యం
  • ఒక్కొక్కరి తలపై ఎంత అప్పుందో లెక్కలతో సహా నిరూపిస్తాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేత టీజేఆర్‌ సుధాకర్‌బాబు
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బతుకులు బాగుపడతాయని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని వైయస్‌ఆర్‌ సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరామని చెప్పారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో దొరికిన ఆదరణ, అభిమానం ఎనలేనిదన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఏకమవుతారన్నారు. రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, మైనార్టీలు రాజకీయంగా ఎదగాలంటే నిజమైన ప్రజా నాయకుడు ఉండాలని, అది వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. 

బలహీనులమంతా బలవంతులమయ్యాం...
వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బలహీనులమంతా బలవంతులుగా తయారయ్యామని సుధాకర్‌బాబు అన్నారు. 2003 చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం తీవ్ర దుర్భిక్షంలో ఉందన్నారు. పంటలు ఎండిపోయి, పశువులు చనిపోయి ఈ రాష్ట్రం ఎప్పుడూ లేని కరువును చూసిందన్నారు. తరువాత పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత రాష్ట్రాన్ని సువర్ణంగా తీర్చిదిద్దారన్నారు. మళ్లీ అదే పాలన కోసం రాష్ట్రం ఎదురు చూస్తుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే తప్ప బతుకులు బాగు కావని ప్రజలే చెబుతున్నారన్నారు. 2019లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదని వస్తున్న ఫోన్‌ కాల్స్‌ వింటుంటే మరింత ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు ఆయన కోటరీ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుతింటున్నారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రజానికం ఒక్కొక్కరి తలపై ఎంత అప్పు ఉందో లెక్కలతో సహా రేపు నిరూపిస్తామన్నారు. 
Back to Top