విశాఖ ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి


హైద‌రాబాద్‌) విశాఖ‌జిల్లా లో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంపై ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. న‌క్క‌ప‌ల్లి మండ‌లం ముదుళ్ల‌పాలెం ద‌గ్గ‌ర జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టి అదుపు తప్పింది.  డివైడర్ ను దాటి అటువైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీ  ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో  బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు సహా కారు లో ప్ర‌యాణిస్తున్న 9 మందితో క‌లిపి 11 మంది మృతి చెందారు.మరణించిన వారిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.  
చనిపోయిన వారి కుటుంబాల‌కు వైఎస్ జ‌గ‌న్ త‌మ సంతాపం తెలియ‌చేశారు. 

తాజా వీడియోలు

Back to Top