ఉగ్రదాడి ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

హైదరాబాద్ః ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రదాడి ఘటనపై ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ వైఎస్ జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. 

పారిస్ లోని పలు చోట్ల  ముష్కరులు నరమేథం సృష్టించడంతో 150మంది ప్రాణాలు కోల్పోయారు. 300మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండించింది.
Back to Top