హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాద్ లో పలు వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్ తో పార్టీ పలువురు పార్టీ నేతలు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తదితరులు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రోజా తన కుటుంబసభ్యులతో కలిసి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయానికి వెళ్లి అధినేత వైయస్ జగన్ తో జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జననేతతో కాసేపు మాట్లాడారు.