రాష్ట్రాన్ని దోచుకుతింటున్న పచ్చపార్టీ

  • పల్నాటి పౌరుషాల గడ్డను దోపిడీకి అడ్డాగా మార్చారు
  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడే దోపిడీ
  • బాబు కొడుకులు, మంత్రులు, శాసనసభ్యులు దోచుకుతింటున్నారు
  • రాబోయే రోజులు వైయస్సార్ ఆశయాల కోసం పుట్టిన  వైయస్సార్సీపీవే
  • వైయస్ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని సుపరిపాలన తెచ్చుకుందాం
  • నరసరావుపేట బహిరంగ సభలో వైయస్సార్సీపీ నేతలు
గుంటూరుః నరసారావు పేట రెడ్డి కాలేజ్ గ్రౌండ్ జనసంద్రమైంది. వైయస్సార్సీపీ నిర్వహించిన బహిరంగసభకు వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. బహిరంగసభలో వైయస్సార్సీపీ నేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై నిప్పులు చెరిగారు.

కోడెలే కాదు..దూడలు కూడా ఉన్నాయి
అంబటి రాంబాబు
టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు పౌరుషాల గడ్డను దోపిడీకి అడ్డగా మార్చారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.  కోడెల నరసరావుపేటలో నిలబడలేక సత్తెనపల్లి వచ్చారు. అక్కడికి వచ్చాక ఎక్కడ చూసినా దోపిడే దోపిడీ. కోడెల ఒక్కరే కాదు..కొన్ని దూడలు కూడా ఏ చేలో పడితే ఆ చేలో పడి మేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా బలం లేని వ్యక్తులు పోలీసులను అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారు. నడికుడి నుంచి కాళహస్తి వరకు రైల్వే ట్రాక్‌ వేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి తెర లేపారు. మైనింగ్‌కు పర్మిషన్‌ కావాలంటే చిన్నబాబును కలవాలనే స్థితికి రెవెన్యూ డిపార్టుమెంట్‌ దిగజారిపోయింది.  పల్నాడులో పోలీసు రాజ్యం నడుస్తోంది. కోడెల అబ్బాయి కోటిన్నర పాత డబ్బులు మార్పిడి కోసం కొందరిని భయాందోళనకు గురి చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇక రెండున్నర సంవత్సరాలు ఓపిక పడితే మన ప్రభుత్వం వస్తుందని అంబటి రాంబాబు అన్నారు. 
––––––––––––––
దోచుకోవడానికి వచ్చారు
మ్రరి రాజశేఖర్‌
టీడీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ విమర్శించారు. మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తే..టీడీపీ నాయకులు సులభంగా వారి బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల లీలలు చూడలేకపోతున్నామన్నారు. పత్తిపాటి పుల్లారావు విపరీతంగా పత్తిని కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. అందరిమీద వంద రూపాయలు ఎక్కువ పెట్టి పత్తి కొనుగోలు చేస్తూ ఆయన వద్ద ఉన్న నల్ల డబ్బును తెల్లగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఇంకొకరు ఆర్టీసీలోని చిల్లర అంతా ఆయనే తీసుకొని రద్దైన నోట్లు ఆర్టీసీకి ఇస్తున్నారని విమర్శించారు. మరోకరు పోలీసుల చేత మార్పిడి చేయించుకుంటున్నారని తెలిపారు. దేశం మీద పడి పోలీసులు బ్యాంకుల వద్ద నుంచి పచ్చ నోట్లు పచ్చ నేతలకు కట్టబెడుతున్నారు. వీరు నిత్యం శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పింఛన్‌ ఇవ్వమంటే..వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వారికి ఇవ్వరట, టీడీపీ అంటేనే ఇల్లు, పింఛన్లు ఇస్తారట. ఇదేక్కడి పాలన అని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ హయాంలో పరిపాలన అంటే ఎంటో చేసి చూపించారని గుర్తు చేశారు. దేశానికే మహానేత ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. అర్హుత ఉన్న వారందరికి సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఒక్క ఇల్లు నిర్మించలేదని విమర్శించారు.
––––––––––––––
వైయస్‌ జగనన్నను సీఎం చేద్దాం
ఎమ్మెల్యే కోన రఘుపతి
చంద్రబాబు పాలన ఇక ఎన్నాళ్లు సాగదని..రాష్ట్రానికి వైయస్‌ జగనన్నను సీఎం చేసుకుందామని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. వైయస్‌ జగనన్న అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. యువతకు ఆయనే ఆదర్శమని చెప్పారు. వైయస్సార్సీపీ తడాఖా ఏంటో టీడీపీకి చూపిద్దామని అన్నారు.  మన జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేం ఉన్నాం. పంచ పాండవులం. ఎవరికి అమ్ముడపోయేవారు లేరు. రాబోయే రోజులు వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం పుట్టిన వైయస్‌ఆర్‌సీపీవేనని,  వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ కూడా ఆయనే కనిపెట్టారట. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. అయితే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. కనీసం ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించాం. అయితే చంద్రబాబు తన ప్రయోజనాల కోసం అడ్డంగా  రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
––––––––––––––
వైయస్ జగన్ తోనే సుపరిపాలన సాధ్యం
మేరుగు నాగార్జున
కాసు మహేష్ రెడ్డి వైయస్సార్సీపీలో చేరడం శుభపరిణామమని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. వైయస్ఆర్ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ చంద్రబాబు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇసుక, మట్టి అమ్ముకొని బాబు, కొడుకులతో పాటు మంత్రులు, శాసనసభ్యులు కోట్లాను కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షస పాలన సాగిస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే వైయస్ఆర్ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమం ఇంటింటికీ చేరేది. ఈనాడు బాబు పాలనలో అవి చేరకపోగా ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారు. టీడీపీ అవినీతి, అక్రమ విధానాలు నచ్చక  వైయస్ జగన్ వెంట నడిచేందుకు ప్రతీ ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పేదలను ఆదుకోవాలన్నపట్టుదల, ఆలోచన గల నాయకుడు వైయస్ జగన్. రాబోయే రోజుల్లో వైయస్ జగన్  గద్దెనెక్కి  సుపరిపాలన అందించడం ఖాయమన్నారు. పల్నాడులో రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో దళితులతో పాటు అన్నివర్గాల  పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ముఖ్యమంత్రి కబంద హస్తాల్లో నలిగిపోతున్నారని మేరుగు ఫైర్ అయ్యారు. 
––––––––––––––
వైయస్‌ఆర్‌ హయాంలోనే ముస్లింలకు మేలు
ఎమ్మెల్యే ముస్తఫా
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మైనార్టీలకు మంచి జరిగింది. నాడు మైనార్టీలకు వైయస్‌ఆర్‌ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. మహానేత మరణాంతరం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించారు. చంద్రబాబు మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. పల్నాడులో అందరూ పులులే ఉండాలి..మేకలు వద్ద. మనమందరం వైయస్‌ జగనన్నకు అండగా నిలబడి రాజన్న రాజ్యాన్ని తీసుకొని వద్దాం. భవిష్యత్తులో జన్మభూమి కమిటీలు ఉండవు.  అందరం వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కడుదాం. పచ్చ పార్టీ నేతలకు భయపడాల్సిన అవసరం లేదు.
 




Back to Top