<strong>వైయస్ జగన్ కోలుకోవాలని మహిళల ప్రత్యేక పూజలు..</strong><strong>టీడీపీ కుట్రను ప్రజలు గమనిస్తున్నారు..</strong>కాకినాడః వైయస్ జగన్ త్వరగా కోలుకోవాలని కాకినాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతుల మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు,అభిషేకాలు మహిళలు నిర్వహించారు.108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.ప్రజా సంకల్పయాత్రకు ఏ ఆటంకాలు కలగకూడదని మహిళలు మొక్కుకున్నారు.వైయస్ జగన్‌పై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వాడని ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతాడన్నారు. చంద్రబాబు మాట్లాడే తీరు పరిశీలిస్తే హత్యాయత్నం చంద్రబాబే చేయించాడనే అనుమానం కలుగుతుందన్నారు.దేవుని దయ, ప్రజల ఆశీస్సులు కాలకాలం వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉండాలని ఆకాంక్షించారు. ప్రాణాపాయం నుంచి తృటిలో నుంచి తప్పించుకుని గాయపడిన వైయస్ జగన్ హత్యాయత్నాన్ని కనీసం ఖండించాల్సిన మానవత్వం కూడా చంద్రబాబుకు లేకపోవడం దారుణమన్నారు. కుటిల సంస్కారానికి నిదర్శనమన్నారు.ప్రజల కోసం,హక్కుల కోసం వైయస్ జగన్ పోరాడుతుంటే, అభినందించాల్సిందిపోయి జగన్‌పై చంద్రబాబు బురదజల్లడం పద్దతి కాదన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడని అవగతమవుతుందన్నారు. హత్యా జరిగిన గంటలోపే ప్రభుత్వం డ్రామాలు చూస్తే ఖచ్చితంగా ఇది టీడీపీ కుట్ర అన్న సంగతి చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుందన్నారు.