విజయమ్మకు విశాఖపట్నంలో ఘనస్వాగతం

విశాఖపట్నం, 16 జూన్‌ 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ‌కు విశాఖపట్నం విమానాశ్రయం వద్ద పార్టీ నాయకులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాజకీయ దిశానిర్దేశం చేసేందుకు విజయనగరంలో నిర్వహిస్తున్నపార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సులో ఆమె పాల్గొంటారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలను స్థానిక ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయనున్నారు.

కాగా ఉత్తరాంధ్రలో పర్యటించడానికి వచ్చిన శ్రీమతి విజయమ్మకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా తరలివచ్చారు.

Back to Top