వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో పూలే వర్ధంతి

విజయవాడ: బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావుపూలే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొనియాడారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పూలే వర్థంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్‌ నేతలు కొలుసు పార్థసారధి, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు పాల్గొని పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే బీసీల అభ్యున్నతి సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందని, వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారన్నారు. 
Back to Top