25న జోగిపేటకు విజయమ్మ

హైదరాబాద్ 19 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 25న మెదక్‌ జిల్లా జోగిపేటలో పర్యటిస్తారు. జోగిపేటలో ఏర్పాటయ్యే భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు.   సభ కోసం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌, పార్టీ జిల్లా కన్వీనర్‌ బట్టి జగపతి బుధవారం ఉదయం సభాస్థలిని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో  శ్రీమతి విజయమ్మ చేస్తున్న పర్యటన జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.

Back to Top