బాధిత కుటుంబాల‌కు వాసుబాబు ప‌రామ‌ర్శ‌

ప‌శ్చిమ గోదావ‌రి:  ఉంగుటూరు మండలంలో బుధవారం పలు బాధిత కుటుంబాల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు పరామర్శించారు. ఉప్పాకపాడులో షేక్ మాబూని  మృతి చెందటంతో వారి కుటుంబాన్ని, నేదూరి  గంగా రత్నం మృతి చెందటంతో వారి కుటుంబాన్ని వాసుబాబు పరామర్శించారు. ఆయ‌న వెంట ఉంగుటూరు, నిడమర్రు మండలాల పార్టీ కన్వీనర్లు మరడ వెంకట మంగారావు, సంకు సత్య కుమార్, మాజీ సర్పంచి సంగాబత్తుల పాండు రంగా పార్ధ సారధి, మాకా సతీష్, అప్పాజీ, దారపురెడ్డి చిన్న అబ్బులు, తదితరులు ఉన్నారు. 

Back to Top