<strong>హైదరాబాద్, 18 మార్చి 2013:</strong> వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వ్యాట్తో ఈ ప్రభుత్వం వ్యాపారుల నడ్డి విరుస్తోందని పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు విచారం వ్యక్తంచేశారు. వస్త్ర వ్యాపారులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలిపారు. వ్యాట్‌పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించటం దారుణం అని వారరు అన్నారు. తక్షణమే ప్రభుత్వం వ్యాట్ను ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు.