<strong>హైదరాబాద్, 28 నవంబర్ 2012:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు, వారి అనుచరులు చేరుతున్నారు. ఈ కోవలో ప్రవాసాంధ్రులు కూడా వైయస్‌సిపిలో చేరేందుకు అత్యంత ఉత్సాహం కనబరుస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ప్రవాసాంధ్రుడు బోయపల్లి అనంతకుమార్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతకుమార్‌తో పాటు మరో 50 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పార్టీ తీర్థం తీసుకున్నారు. వారందరినీ కూడా విజయమ్మ పార్టీలోకి స్వాగతించారు.