వైయస్ఆర్ కాంగ్రెస్‌లో తూ.గో. మాజీ ఛైర్మన్

హైదరాబాద్:

తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నివాసానికి వెళ్లిన ఆయన ఆమె సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. తూర్పు గోదావరికే చెందిన కాంట్రాక్టర్  గొల్ల ప్రవీణ్ కుమార్, తాడిపత్రి మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ నజీర్ సాహెబ్ తనయుడు మున్నా కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Back to Top