అంతిమ విజయం మనదే

బాబు అసమర్ధ పాలనకు చరమగీతం పాడుదాం
బాబు కుట్రలు, కుతంత్రాలు ఎంతోకాలం నిలబడవు
మరో రెండేళ్లు ఇదే పోరాట స్ఫూర్తితో పనిచేయండి
అంతిమ విజయం మనదే..పార్టీ నేతల సమావేశంలో వైయస్ జగన్


వైయస్ఆర్ కడపః

టీడీపీ అధికారమదంతో అనైతిక రాజకీయాలు చేస్తోందని వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కడపలో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ....చంద్రబాబు నాయుడు ప్రజల్లో పలుచనైపోతున్నాడనని తెలిసి, డబ్బు అహంకారంతో కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఇవేవీ ఎంతోకాలం నిలబడవు. మరో రెండేళ్లు ఇదే పోరాట స్ఫూర్తితో పనిచేయండి. . చంద్రబాబు అసమర్థ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరల్లోనే ఉందని నేతలనుద్దేశించి అన్నారు. 

‘మహాభారతం, రామాయణం, ఖురాన్, బైబిల్‌... పవిత్ర గ్రంధాలన్నీ ధర్మానిదే అంతిమ విజయమని చెబుతున్నాయి. కాలక్షేపం కోసం సినిమాకు వెళ్లినా 13 రీళ్లల్లోనూ విలన్‌ పాత్రదే పైచేయి, 14వ రీల్‌లో హీరో విజయం సాధిస్తారు. పవిత్ర గంథ్రాలైనా, సినిమా అయినా నీతి ఒక్కటే... అంతిమ విజయం ధర్మానిదేనని వైయస్ జగన్ అన్నారు.  వైయస్సార్‌ జిల్లా కేంద్రమైన కడప జయరాజ్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో రైల్వేకోడూరు, బద్వేల్, మైదుకూరు, రాజంపేట, కడప నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను పేరుపేరునా పలకరించి, మాట్లాడారు. కాగా, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అధికార టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి ఎంపికైన ఒక జెడ్పీటీసీ సభ్యురాలు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం జయరాజ్‌ గార్డెన్‌లో వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరారు.

Back to Top