ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్‌ సజీవం..

మహానేత  వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి వ్యక్తిత్వం సమాజానికి ఆదర్శప్రాయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళర్పించి వైయస్‌ఆర్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కుల,మతాలకు అతీతంగా వైయస్‌ఆర్‌  వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలికరించే నిండైన వ్యక్తిత్వం వైయస్‌ఆర్‌ది  అన్నారు.  వైద్యవృత్తిలో ఉన్నప్పుడు ఆయన కడపలో రూపాయి డాక్టర్‌గా ప్రసిద్ధిచెందరన్నారు. పేదలను ఆదుకోవాలనే సంకల్పానికి అప్పుడే బీజం పడిందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల మనసు చూరగొన్న వ్యక్తిగా మహానేతగా ఎన్నటికి ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంతరెడ్డి, లీగల్ సెల్ సెల్ అధ్యక్షులు సుధాకరరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పేదలకు చీరలు, పుస్తకాలను  పంపిణీ చేశారు. 
Back to Top