<br/>హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైయస్.రాజశేఖరరెడ్డి 69వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులతో కలసి పాదయాత్రగా బయలుదేరి వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించాలన్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వేడులకల్లో పార్టీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రజా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.