టిడిపి ఎస్సెమ్మెస్‌‌ల నాటకం: భూమన

హైదరాబాద్, 11 జూన్‌ 2013:

దొంగ సర్వేలు చేయించడమే కాక, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తోందంటూ ఎస్ఎంఎ‌స్ల ప్రచారం చేస్తున్న టిడిపిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారానికి చంద్రబాబు తనయుడు ట్విట్టేష్ బాబు సారథ్యం వహిస్తున్నారని‌ ఆయన ఆరోపించారు. ట్విట్టేష్ బాబు దొంగ సర్వేలను ప్రజలెవ్వ‌రూ నమ్మబోరని భూమన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ 190 సీట్లు గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయ‌న్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వలసలను ఆపుకోవడానికే ఇలాంటి దొంగ నాటకాలు అడుతోందని భూమన ఆరోపించారు. అందులో భాగంగానే ఆ పార్టీ ఎస్ఎంఎ‌స్ రాజకీయానికి తెర తీసిందని భూమన వ్యాఖ్యానించారు.

Back to Top