వైఎస్ జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను కలిశారు. లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో కృష్ణయ్య ఆయన్ను కలుసుకున్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోరారు. 

జనాభా ప్రతిపాదికన బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్న కృష్ణయ్య... బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నానని.. అందులో భాగంగా వైఎస్ జగన్ ను కలిసినట్లు కృష్ణయ్య తెలిపారు.
 
Back to Top