అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల మరోమారు దాడులు తెగబడ్డారు. అప్పేచెర్ల గ్రామంలోని వైయస్ఆర్‌సీపీ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి సోదరి, అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. హత్యా కేసులో రాజీ కాకపోవడంతో తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు హరిప్రియ పేర్కొంటున్నారు. తనను చంపేందుకు జేసీ వర్గీయులు కుట్ర పన్నారని ఆమె తెలిపారు.<br/>