చెరకు పంటకు క్రాప్‌ హాలీడే

విశాఖ‌:  నాలుగేళ్లుగా చెర‌కు పంట సాగు చేసి న‌ష్టాలు మూట‌క‌ట్టుకున్నామ‌ని రైతులు వాపోయారు. పెట్టుబ‌డులు కూడా చేతికంద‌క‌పోవ‌డంతో చెర‌కు పంట‌కు క్రాప్ హాలీడే ప్ర‌క‌టించి వ‌ల‌స‌లు వెళ్తున్నామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 251వ రోజు త‌మ ప్రాంతానికి వ‌చ్చిన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను చెర‌కు రైతులు క‌లిశారు. వైయస్‌ఆర్‌ హయాంలో లాభాల్లో ఉన్న గోవాడ చక్కెర కర్మాగారం చంద్రబాబు వచ్చాక నష్టాలో కూరుకుపోయిందని చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఆ ఫ్యాక్టరీని మరల తెరిపిస్తారనే నమ్మకం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాలుగు నియోజవర్గాల్లో ఉన్న రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. చెరకు పంటకు హాలీడే ప్రకటించి వలసపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులంతా రోడ్డు ఎక్కితే వారిపై టీడీపీ ప్రభుత్వం  లాఠీచార్జీలు చేయించి అక్రమకేసులు బనాయియిందన్నారు. టీడీపీ వచ్చిన తర్వాత  సుమారు రూ.40 కోట్లు పాలకవర్గం  స్వాహా చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వం సిబిఐ విచారణ కూడా జరిపించలేదన్నారు.
Back to Top