30న కుప్పంలో జగన్ సమైక్య శంఖారావం

హైదరాబాద్ :

ఈ నెల 30వ తేదీ శనివారంనాడు చిత్తూరు జిల్లా కుప్పంలో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కుప్పంలో నిర్వహించే బహిరంగ సభలో సమైక్యాంధ్రప్రదే‌శ్‌ అంశంపై పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ప్రసంగిస్తారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించనున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు కుటుంబాలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.గంటలకు కుప్పం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కుప్పం వస్తున్న శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి స్వాగత ఏర్పాట్లలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. తొలుత ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు.

తొలి రోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేశ్ కుటుంబ సభ్యులను‌ శ్రీ జగన్ ఓదారుస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత ‌మహానేత శ్రీ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అనంతరం పలమనేరు వెళతారు. రాత్రికి కుప్పంలోనే శ్రీ జగన్‌ బస చేస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Back to Top