సాహితీ దిగ్గజం రావూరి మృతికి జగన్‌ సంతాపం

హైదరాబాద్, 19 అక్టోబర్ 2013:

తెలుగు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్ రా‌వూరి భరద్వాజ మృతి పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశ సాహిత్యంలో అత్యున్నత పురస్కారం తలుపు తట్టిన ఆరు నెలలకే రావూరి దైవంలో ఐక్యమయ్యారని శ్రీ జగన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

`రావూరి అక్షరం... వాన చినుకు మట్టిబెడ్డను తాకితే అ మట్టి వెదజల్లే పరిమళం. ఆయన రచన ఒక వ్యాపకం కాదు.. అది ఒక దీక్ష. ఆయన జీవితం నిష్టతో కూడిన సందేశం. జ్ఞానపీఠ్‌ అవార్డు స్వీకరించిన కొద్ది రోజులకే రావూరి భౌతికంగా కనుమరుగు కావటం పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రావూరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను' శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Back to Top