సమైక్యాంధ్ర కృషిలో ముందు‌న్న వైయస్ జగన్

హైదరాబాద్ :

సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అవిరళ కృషి అమోఘమని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రశంసించింది. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభను దిగ్విజయవంతంగా నిర్వహించిన శ్రీ జగన్‌కు ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు శ్రీ జగన్‌ను కలిసిన ఫోరం నాయకులు జననేతను గజమాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంప్లాయీస్ వై‌స్ చైర్మ‌న్ బెన్సన్, కోశాధికారి వరలక్ష్మి, సంయుక్త కార్యదర్శి ‌బి. ప్రశాంతి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, హౌసింగ్ సొసైటీ డెరైక్ట‌ర్ సత్యసులోచన, సచివాలయ ఉద్యోగ క్రిస్టియ‌న్ సొసైటీ అధ్యక్షు‌డు జాన్ దేవ‌న్‌రాజ్ పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top