శ్రీమతి షర్మిల కాలికి గాయం

రంగారెడ్డి:

దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శనివారం విరామం ప్రకటించారు. కాలు బెణకడంతో స్వల్పంగా గాయపడి, నొప్పితో బాధపడుతున్న శ్రీమతి షర్మిలను వైద్యుల బృందం పరీక్షించింది. ఒకరోజు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో యాత్రకు ఒకరోజు విరామం ప్రకటించినట్లు పార్టీ కార్యక్రమ సమన్వయకర్తలు తలశిల రఘురాం, కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. శ్రీమతి షర్మిల మోకాలి లిగమెంట్‌కు గాయమైందని ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆనంద్ తెలిపారు. పరీక్షలలో  కాలికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని తేలిందన్నారు. రేపటి పాదయాత్రపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Back to Top