వైయస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

రాయచోటి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటిలో ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు ఎమ్మెల్యే శ్రీకాంరెడ్డి, పార్టీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 10 సంవత్సరాల హోదా అంటూ బీజేపీ, 15 ఏళ్లు అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నసిబూన్‌ఖానమ్, కో ఆప్షన్‌ సభ్యులు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజ్‌ రహిమాన్, కొలిమి చాన్‌బాషా, లయన్‌ నాగేశ్వరరావు, అన్వర్‌బాషా, వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి కిషోర్, జగన్‌ యువసేన నాయకులు సురేష్‌కుమార్‌రెడ్డి, విక్కీ, దేవేంద్రకుమార్, మహేష్, లాలాదాస్, సాదిక్, మండెం ప్రసాద్, హేమంత్‌నాయక్, గిరివర్దన్‌ పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top