<strong>ప్రొఫెసర్ జమీల్‌బాషా</strong>ప్రత్యేక హోదా మన హక్కు..దాని కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు మనమందరం తోడుగా ఉందాం. ఇక్కడ వనరులు, వసతులు లేక విద్యార్థులు బెంగుళూరు, చెన్నై వెళ్తున్నారు. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.–––––––––––––––––––––<strong>యువకులారా గర్జించండి</strong><strong>జక్రియా, రిౖటైర్డు హెచ్‌ఎం</strong>రాష్ట్రంలో నష్టపోయింది యువత మాత్రమే. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు వస్తేనే జాబు అన్నారు. లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తానని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తరువాత అందర్ని మోసం చేశారు. యువకులారా మీ శక్తి మీకు తెలియదు. సింహాలై గర్జించండి. మోసం చేసిన ప్రభుత్వాన్ని క్షమించకూడదు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మన ఆకాంక్షలు నెరవేర్చే వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందాం. అభిమానాన్ని ఓట్లుగా మార్చాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. వైయస్ జగన్ సీఎం కావడం ఖాయం. <br/>