రోడ్డుపై వైయస్ విజయమ్మ బైఠాయింపు

ఖమ్మం, అక్టోబర్ 2013:

నల్గొండ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో తాను పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నడి రోడ్డుపైనే బైఠాయించారు. ఖమ్మం - నల్గొండ జిల్లాల సరిహద్దులోని పైనంపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటనకు చోటుచేసుకుంది. నల్గొండజిల్లా వరద బాధిత ప్రాంతాలకు వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పైనంపల్లి వద్ద భారీగా మొహరించిన పోలీసులు ఆమె పర్యటనకు ఆటంకం కలిగించారు. దీంతో విజయమ్మ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు.

అంతకు ముందు మధిర నియోజకవర్గంలోని కలకోటలో భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మిర్చి, జొన్న పంటలను శ్రీమతి విజయమ్మ పరిశీలించారు. రైతులను పరామర్శించి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పత్తి మొక్కలను శ్రీమతి విజయమ్మకు రైతులు చూపించి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులకు లబ్ధి చేకూరే విధంగా రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని శ్రీమతి విజయమ్మ వారికి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనను ముగించుకుని ఈ రోజు ఖమ్మంలో అడుగుపెట్టిన శ్రీమతి విజయమ్మ బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Back to Top