సమైక్యాంధ్రకు మద్దతు కోసం ఢిల్లీకి విజయమ్మ

న్యూఢిల్లీ, 8 అక్టోబర్ 2013:

సమైక్యాంధ్రకు జాతీయ స్థాయిలో నాయకుల మద్దతు కూడగట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రయ‌త్నాలు ప్రారంభించింది‌. ఈ క్రమంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో ‌ఒక బృందం మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూడాలని జాతీయ నాయకులను ఈ బృందం కోరనున్నది. సమైక్యాంధ్ర ఆవశ్యకతను శ్రీమతి విజయమ్మ జాతీయ నేతలకు వివరించనున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఇరు ప్రాంతాల ప్రజలకు కలిగే నష్టాలను ఆమె నేతలకు తెలియజేయనున్నారు.

రాష్ట్ర విభజన విషయమై వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.‌ అడ్డగోలుగా చేస్తున్న రాష్ట్ర విభజన అనే అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలసి ముందుకు రావాలని ఆయన కోరిన విషయం తెలిసిందే.

Back to Top