సముద్రమంత ప్రేమ, అభిమానం

నేటితో 2,500 కి.మీ. పూర్తవుతున్న శ్రీమతి షర్మిల పాదయాత్ర

‌ప్రత్తిపాడు (తూ.గో.జిల్లా) :

మహానేత రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ముందడుగు వేస్తోంది. పేదలు, బడుగుల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ సుదీర్ఘ, చారిత్రక పాదయాత్ర లక్షలాది మంది ప్రజానీకం నీరాజనాలతో మహా ఉద్యమంగా కొనసాగుతోంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆదివారం 2,500 కిలోమీటర్లు పూర్తిచేసుకోబోతోంది. అన్యాయాన్ని, అక్రమాలను నిరసిస్తూ ఇడుపులపాయలో 2012 అక్టోబర్‌ 18న పడిన తొలి అడుగు.. రోజు రోజుకూ జనవాహిని వచ్చి మరింతగా చేరుతుండడంతో మహా ప్రభంజనంగా మారుతోంది. స్వార్థ పరులు, కుటిల రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నట్లుగా వైయస్ కుటుంబంపై తమకు ఉన్నది సానుభూతి కాదని.. ప్రజల కోసం జీవితాల్నే త్యాగం చేసిన ఆ మహానేత కుటుంబంపై ఉన్నది అభిమానం, కృతజ్ఞత అని సభలకు వస్తున్న అశేష ప్రజానీకం గొంతెత్తి చెబుతోంది. శ్రీ జగ‌న్మోహన్‌రెడ్డి ఒక్కరిని ఎదుర్కోవడానికి సిగ్గు విడిచి మరీ కలిసిపోయిన కాంగ్రెస్, ‌టిడిపిలకు బుద్ధి చెబుతామని స్పష్టం చేసింది. వృద్ధాప్యం మీద పడినా, ఆరోగ్యం బాగుండకపోయినా, అంగవైకల్యం అడ్డుగా ఉన్నా.. అలుపన్నదే ఎరుగకుండా తొలి నుంచి పాదయాత్రలో పాల్గొంటున్న మహానేత అభిమానులు శ్రీమతి షర్మిలతో తమ మదిలోని భావాలను శనివారంనాడు పంచుకున్నారు.

‘ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్ముకున్న జనం కోసం, నాన్నగారి ఆశయం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన ధీరుడు జగనన్న. నాన్న మిగిల్చిన పనులు నేను చేస్తానంటూ ముందుకొచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే‌ శ్రీ జగన్ రావాలనే నమ్మకాన్ని, ఏదైనా సాధిస్తే వైయస్‌ఆర్ వారసుడిగా శ్రీ జగ‌న్మోహన్‌రెడ్డి మాత్రమే సాధించగలరనే నమ్మకాన్ని ఆయన తన ఓదార్పుయాత్ర ద్వారా, దీక్షల ద్వారా ప్రజల్లో కల్పించారు. ఆ యాత్ర, దీక్షలతో మూడేళ్ల పాటు ప్రజల మధ్యే గడిపారు. కానీ, ఆయనను చేయని నేరానికి జైలులో పెట్టారు. ‘జగమంత కుటుంబం నాది’ అనుకున్న జగనన్నను ఈ రోజు ఆ జనం నుంచి వేరుచేశారు. కాంగ్రెస్, ‌టిడిపి స్వార్థ రాజకీయాల కోసం ఆయన జీవితాన్ని బలిపెట్టారు. కానీ, జగనన్న సోదరిగా నేనున్నాను అంటూ శ్రీమతి షర్మిల ప్రజల మధ్యకు వచ్చారు. మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఒక మహిళ 3,000 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి సిద్ధపడటం చాలా అరుదైన గొప్ప విషయం. మండుటెండల్లోనూ చెదరని చిరునవ్వుతో ప్రజలతో ఆమె మమేకమైన తీరు అద్భుతం. అది ప్రజల మీద నిజమైన ప్రేమ ఉన్న వాళ్లకే సాధ్యపడుతుంది. వికలాంగులను, వృద్ధులను, వ్యాధి పీడితులను ప్రేమగా గుండెలకు హత్తుకుని.. ‘భయపడొద్దు జగనన్న ఉన్నాడు’ అనే నమ్మకాన్ని, భరోసాను శ్రీమతి షర్మిల కల్పిస్తున్నారు. కష్టాలు ఎన్ని ఉన్నా, శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా వైయస్‌ఆర్ కుటుంబం మాకు అండగా నిలబడుతుందనే నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వగలిగారు. ఇది పాదయాత్ర అయినా మహా ఉద్యమంగా సాగుతోంది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల తేడా లేకుండా ప్రజలంతా ముందుండి నడుస్తున్న పాదయాత్ర ఇది. 30 ఏళ్లుగా రాజకీయ అనుభవాన్ని సంపాదించినట్లుగా‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇది మహిళలందరికీ గర్వకారణం. కోట్లాది మంది కోసం జగనన్న కలలను సాకారం చేయడానికి అవిశ్రాంతంగా కష్టపడుతున్న శ్రీమతి షర్మిల వెన్నంటి నడవడం మా అదృష్టం.

శ్రీమతి షర్మిల లక్షలాది మంది ప్రజల కష్టాలు తెలుసుకొని.. వాళ్ల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె వెనుకే నడుస్తూ మేం కూడా వాళ్లందరినీ గమనిస్తున్నాం. ఇది సానుభూతి గాలి అని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. కానీ, అది సానుభూతి కాదు.. వాళ్లలో మాకు కనిపించింది కృతజ్ఞత. మహా నాయకుడు వైయస్ కుటుంబం మీద ఉన్న ప్రేమ, అభిమానం. అప్పుడు వై‌యస్‌ఆర్ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచారు. ఆ అభిమానంతోనే ప్రజలంతా పరుగుపరుగున వచ్చి‌ ఆయన తనయ శ్రీమతి షర్మిలను ఆశీర్వదిస్తున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనడం నిజంగా మా అదృష్టం. మా కుటుంబాలకు వైయస్‌ఆర్ ఎంతో సహాయం చేశారు. మాకు రుణాలు మాఫీ అయ్యాయి. పిల్లల చదువులు ఉచితంగా సాగుతున్నాయి. జగనన్న బయటికి వస్తే చాలా మందికి మా‌ లాగే మేలు జరుగుతుందనే ఆశ. మా ఊపిరి ఉన్నంత వరకూ వైయస్‌ఆర్ కుటుంబం వెంటే ఉంటాం.

కాంగ్రె‌స్ పార్టీ కోసం‌ మహానేత వై‌యస్‌ఆర్ 35 ఏళ్లు కష్టపడ్డారు. తన ఆస్తులు కూడా పోగొట్టుకొని, ఎన్నో బాధలు అనుభవించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు వైయస్‌ఆర్. కానీ, ఇవాళ అదే కాంగ్రె‌స్ పార్టీ వై‌యస్‌కు, ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేస్తోంది. సినిమా నటుడు చిరంజీవి వెళ్లి అడగగానే సోనియా గాంధీ అపాయింట్‌మెంటు ఇచ్చారు. కానీ, ఆ మహానేత సతీమణి శ్రీమతి విజయమ్మ నెల రోజులు ప్రయత్నించినా ఇవ్వలేదు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ 30 నుంచి 35 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అప్పుడు అదే సోనియా శ్రీమతి విజయమ్మ అపాయింట్‌మెంట్ అడగాలి. జగనన్న ముఖ్యమంత్రి కావాలి. వై‌యస్ సంక్షేమ పథకాలన్నింటికీ ‌ఇప్పటి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మళ్లీ రాజన్న కాలంనాటి మంచి రోజులు మళ్లీ రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపైనా జగనన్న బయటికి వస్తారు. మా పేదోళ్ల కన్నీళ్లు తుడుస్తారు.

శ్రీమతి షర్మిల నడిచే తీరు అచ్చం రాజన్నలాగే ఉంది. పేద బడుగు, బలహీన వర్గాల వారి కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడడం కోసం ఆమె సుదీర్ఘ ప్రయాణం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా ఒక మహిళ ఇలాంటి పాదయాత్ర చేయలేదు. ఆడబిడ్డ నడుస్తుంటే మా ప్రాణం ఆగలేదు. వైయస్‌ఆర్ కుటుంబం మీద ఉన్న అభిమానాన్ని సోనియా‌ గాంధీకి చూపించడానికి, జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టడాన్ని నిరసిస్తూ.. శ్రీమతి షర్మిలతో పాటు అడుగులు వేస్తున్నాం. ఆమె పట్టుదలే మా నడకకు బలాన్నిస్తోంది. ప్రజలకు వైయస్‌ఆర్ ఎంత‌ మేలు చేయాలో అంత చేశారు. మరి ఈ రోజు ఆ కుటుంబానికి ఈ పాలకులు చేసింది ఏమిటి? జనం కోసం నిలబడిన నాయకుడిని ఇన్ని కష్టాలపాలు చేస్తారా? ఈ అన్యాయాన్ని ప్రతీ ఒక్కరు ప్రతిఘటించాలి. ఈ పాదయాత్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ కావాలి. స్వార్థపరులకు, నీతి లేని నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పాదయాత్రలో పాల్గొంటాం. 2,500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేస్తున్న సందర్భంగా శ్రీమతి షర్మిలకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం.’
ఇవీ శ్రీమతి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’లో తొలి నుంచీ పాల్గొంటున్న నాయకులు, అభిమానుల మనోగతాలు.

తొలి నుంచీ మరో ప్రజాప్రస్థానంలో పాల్గొంటున్నది వీరే:

కాపు భారతి, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్ట‌ర్ హరికృష్ణ, జ్యోతుల నవీ‌న్, తిమ్మయ్య పంతులు, కొత్తచెర్వు శంక‌ర్, దవళ వెంకటగిరి బాబు, ఏసు, ప్రమీల, సరస్వతి, ‌పీరమ్మ, రాఘవేంద్ర, జంపన రామకృష్ణ కుమారరాజు, నాగలక్ష్మి, నర్సింహ, ఉప్పులూరి లక్ష్మీరెడ్డి, అంజిరెడ్డి, వెంకట కోటిరెడ్డి, సత్యనారాయణ, కోదండరాం, లక్ష్మణ్‌నాయక్, సీతారాం, శ్రీనివాసరావు, ఉప్పు వరప్రసా‌ద్, కొండారెడ్డి, రామలక్ష్మి, రెడ్డయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, రంగా, వెంకటనారాయణ, సుబ్బారెడ్డి, సాంబశివారెడ్డి, గంగమ్మ, దిండి వెంకటే‌శ్, గోపిరెడ్డి సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సుందర్రాజు, బూదాల శేషు, అందూరి రాజగోపా‌ల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, చల్లా రాంరెడ్డి, శివారెడ్డి, మారుతి, గుత్తిరెడ్డి చంద్రహాస్, పొలసాని బుజ్జి (సురే‌ష్), కలకొండ రవికుమా‌ర్, భాను ప్రసా‌ద్‌గుప్తా, దోసపాటి నాగేశ్వర్‌రావుగౌడ్, నూనె దశరథరెడ్డి, పుల్లకూర మల్లి‌కార్జున, భాస్కర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తొలి నుంచీ శ్రీమతి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

Back to Top