24 నుంచి విశాఖ జిల్లాలో షర్మిల పాదయాత్ర

విశాఖపట్నం, 17 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 24 నుంచి విశాఖ జిల్లాలో ప్రారంభం కానున్నది. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం పది నియోజకవర్గాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగనున్నదని పాదయాత్ర కమిటీ సభ్యుడు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు ప్రసాదరాజు సోమవారంనాడు విశాఖపట్నంలో వెల్లడించారు.

విశాఖ జిల్లాలో 12-13 రోజుల పాటు కొనసాగే మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో 170- 180 కిలో మీటర్ల మేర శ్రీమతి షర్మిల పర్యటిస్తారని ప్రసాదరాజు వివరించారు. విశాఖపట్నంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రసాదరాజు తెలిపారు. ఇంతవరకూ మొత్తం 11 జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీమతి షర్మిల ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గంలో అడుగుపెడతారు. దీనితో శ్రీమతి షర్మిల విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

Back to Top