వైయస్‌ జగన్‌ను కలిసిన స్కేటింగ్‌ క్రీడాకారులు

విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించడం లేదని స్కేటింగ్‌ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ మేరకు స్కేటింగ్‌ క్రీడాకారుడు ఫణింద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మూడు సార్లు, రాష్ట్ర స్థాయి పోటీల్లో 12 సార్లు ఆడి పతకాలు సాధించినా ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం లేదన్నారు. దీనిపై వైయస్‌ జగన్‌కు వివరించడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. 
 
Back to Top