తెలంగాణలో ఆత్మహత్యలపై పేటెంట్ హక్కు కేసీఆర్, హరీష్ లదే

కరీంనగర్‌: తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై పేటెంట్‌ హక్కు కేసీఆర్‌, హరీష్‌దేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. గూడెంలో దళితుల ఆత్మహత్యాయత్నంపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీవో 39ని రద్దు చేసి రైతు సమన్వయ కమిటీలను నిలిపేయాలన్నారు. అగ్రికల్చర్‌ అధికారుల ద్వారా అర్హులైన రైతులను గుర్తించాలని సూచించారు. దళితుల ఆత్మహత్యాయత్నంపై బెజ్జెంకి మండలంలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన బంద్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి నివాసరావు, సింగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top