సైకిల్ పార్టీలో సైకో సూదిగాళ్లు..!

దోచుకోవడం దాచుకోవడమే పని..!
తెలుగువారి పరువు తీశాడు..!
గుంటూరుః ఐదు  కోట్ల ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ జగన్ తన కోసం చేస్తున్న దీక్ష కాదని, తాను తినకుండా హోదా వస్తే అందరూ కడుపునిండా తింటారని చేస్తున్న దీక్ష అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ, శ్వాస ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ వీరోచితంగా చేస్తున్న దీక్ష అని రోజా తెలిపారు. అడ్డగోలు విభజనతో అవశేష్ ఆంధ్రప్రదేశ్ గా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకు వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నట్లు రోజా పేర్కొన్నారు. 

ప్రతి గుండె ప్రత్యేకహోదా కోరుకుంటోంది..!
రాష్ట్రంలోని ప్రతి గుండె ప్రత్యేకహోదా కోరుకుంటుంటే చంద్రబాబు వద్దంటున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హోదాను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాడు. చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి తెలుగు వాళ్ల పరువు తీశాడని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో బాహుబలి సినిమాలో భల్లాలదేవ మాదిరి చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మేనమామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. ఈరోజు నమ్మి ఓటేసినందుకు మహిళలు, రైతులు, కార్మికులు ఇలా అందరినీ మోసం చేశారన్నారు.  

పదువులు తప్ప
చంద్రబాబుకు సీఎం హోదా కావాలి, ఎంపీలకు మంత్రుల హోదా కావాలి. రాష్ట్రాన్ని నడిరోడ్డున పెట్టేందుకు కూడా వెనకాడడం లేదని, దిగజారి రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయన భజన బ్యాచ్ హోదా గురించి ఏనాడైనా మాట్లాడారా అని రోజా ప్రశ్నించారు. ఉనికి కోసం దీక్ష చేస్తున్నారంటూ దేవినేని ఉమ నీచంగా మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. పట్టిసీమలో పంపులు లేకుండా జాతికి అంకితం చేసిన దౌర్భాగ్యం ఏవరైనా ఉన్నారంటే ఉమ మాత్రమేనని నిప్పులు చెరిగారు. హంద్రీనీవా నుంచి దొంగతనంగా పైపులు ఎత్తుకొచ్చారని రోజా దుయ్యబట్టారు.  ఒక్కపంపుతోనే గండి పడితే, 27 పంపులు తెరిస్తే టీడీపీవాళ్లే కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. 

సైకిలో పార్టీలో సైకోలు..!
చంద్రబాబు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లాకో సైకో సూదిగాడిని తయారు చేస్తున్నాడని రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాలిగాళ్లు, సోదిగాళ్లు, సైకో సూదిగాళ్లు తయారై రాష్ట్రంలో  రైతుల భూములు లాక్కోవడం, మహిళలను కొట్టడం, నేరస్తులకు అండగా ఉండడం లాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ,గంటా,అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల ఎంతసేపు దోచుకొని దాచుకోవడం. అడ్డువచ్చిన వాళ్లపై కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి అన్నదే ఎరగరన్నారు. సైకిల్ పార్టీలో అందరూ సైకోలా తయారై రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని... గ్రామాలు, మండలాలు , నియోజకవర్గాల్లో సైకో సూదిగాళ్లను నిలదీసి వారి వెన్నులో వణుకు పుట్టేవిధంగా ప్రతిఒక్కరూ వైఎస్ జగన్ కు అండగా నిలవాలను కోరారు.

Back to Top