షర్మిల సమక్షంలో పార్టీలో చేరిన కార్యకర్తలు

తిరుపతి(పశ్చిమ గోదావరి జిల్లా), 19 మే  2013:

పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం ఉదయం తిరుపతి క్రాస్ రోడ్డు వద్ద ప్రారంభమైంది. ఆదివారం యాత్ర 153వ రోజుకు చేరుకుంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల పాలక కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానూ, ఆ పార్టీకి వంత పాడుతున్న టీడీపీ వైఖరికి నిరసనగానూ కిందటేడాది అక్టోబర్ 18న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.   గాంధీనగర్ సెంటర్‌లో షర్మిల సమక్షంలో వివిధపార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఆదివారంనాడు శ్రీమతి షర్మిల 12.5 కిలోమీటర్లు నడుస్తారని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వెళ్లే అడ్డరోడ్డు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి నల్లజర్ల చేరుతుందని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top