<strong>మహబూబ్‌నగర్, 1 డిసెంబర్ 2012</strong>: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 45వ రోజు శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అల్లిపురం శివారు నుంచి ప్రారంభమవుతుంది. దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్నచింతకుంట, ఎద్దులాపురంలలో శ్రీమతి షర్మిల నిర్వహిస్తారు. ఎద్దులాపురంలో మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఆమె చినవడ్లమాను, పెదవడ్లమాను, నెల్లికొండి గ్రామాల జాతీయ రహదారి వరకూ పాదయాత్ర చేస్తారు. శనివారం రాత్రికి నెల్లికొండి గ్రామ శివారులో షర్మిల బస చేస్తారు. శ్రీమతి షర్మిల శనివారం 18.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మీడియాకు పంపిన ప్రకటనలో తెలిపారు.