షర్మిలకు సంఘీభావంగా పూజలు

హైదరాబాద్, 16 మే 2013:

శ్రీమతి షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ సమన్వయకర్త వెల్లాల రామ్మోహన్ బల్కంపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. రెండు వేల కొబ్బరికాయలను కొట్టారు. పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆయన ఆకాంక్షించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ జగన్ సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర  గురువారం నాడు పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడులో 2 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Back to Top