శనివారం నాటి యాత్ర 12 కిమీ

కాకినాడ 14 జూన్  2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం 180వ రోజుకు చేరుతుంది. పాదయాత్ర కాకినాడ రూరల్ మండలం పండూరులో మొదలవుతుంది. పి. వెంకటాపురం క్రాస్ రోడ్, పవర క్రాస్ రోడ్ వరకూ సాగిన అనంతరం శ్రీమతి షర్మిల భోజన విరామం తీసుకుంటారు. తదుపరి చిత్రాడ, పిఠాపురం వంతెన, ఉప్పాడ సెంటర్ మీదుగా కోటగుమ్మం జంక్షన్, పోలీసు స్టేషన్ సెంటర్ వరకూ సాగుతుంది. ఉప్పాడ సెంటర్లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. శనివారం మొత్తం 12 కిలోమీటర్లు నడుస్తారు.

Back to Top