సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారు: కొణతాల

విశాఖపట్నం, 14 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  విషయంలో సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త  కొణతాల రామకృష్ణ  ఆరోపించారు. సోనియా అల్లుడికో న్యాయం.. శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డికో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.  డీఎల్‌ఎఫ్‌ కుంభకోణంలో సోనియా తన అల్లుడిని వెనకేసుకొచ్చి తప్పించిందన్నారు. అతిగా ప్రవర్తించే సీబీఐ  తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు.

Back to Top