సంక్షేమ పథకాలను మరిచిన ప్రభుత్వం

దర్పల్లి:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తి గా విస్మరించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మునిపల్లి  సాయిరెడ్డి విమర్శించారు. సీతాయిపేట్ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్నారన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్తు అమలు చేశారనీ, వారు తీసుకున్న పంట రుణాలు మాఫి చేసిన ఘనత మహానేతదేననీ వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని పావలా వడ్డీ రుణాలు అందించారన్నారు. పింఛనర్లకు టీడీపీ హయాంలో అమ లు చేసిన రూ. 75ను మూడు నెలలకోసారి ఇచ్చే వారని వైయస్ఆర్ దానికి స్వస్తి చెప్పి వృద్ధులకు, వితంతులకు రూ. 200, వికలాంగులకు రూ.500 నెల నెల ఇస్తూ ఆదుకున్నారన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రయితే మళ్లీ పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. పార్టీ  జిల్లా యువజన కన్వీనర్ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రయితే పేదల కల నెరవేరుతుందన్నారు.

Back to Top