రైతు బాంధవుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి

విశాఖ జిల్లాః రైతు బాంధవుడు దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డికి రైతులకు ఇచ్చిన ప్రోత్సహాన్ని ఉత్తమ రైతు అవార్డులు గ్రహీతలు గుర్తుచేసుకున్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో ఉత్తమ మహిళా రైతు అవార్డు పొందిన అరుణ, రిటైర్డ్‌ వ్యవసాయాధికారి నిఖేశ్వరరావు జననేత వైయస్‌ జగన్‌ను కలిసి ఆయన హయాంలో అన్నదాతలకు చేకూరిన  ప్రయోజనాలను వివరించారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పొలంబడి కార్యక్రమంతో రైతులకు ఎంతో లబ్ధిచేకూరిందన్నారు.. రైతు బాంధవుడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రోత్సహంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించినందుకు గాను 2005లో రవీంద్రభారతీలో  రైతులకు, వ్యవసాయధికారులకు అవార్డులు ఇచ్చారన్నారు. కవులు,కళాకారులకు అవార్డులు లిచ్చే రవీంద్రభారతిలో  రైతులకు అవార్డులు ఇచ్చిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని కొనియాడారు.

తాజా ఫోటోలు

Back to Top