- ఘనంగా ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు- నగరి నియోజకవర్గంలో రాజన్న క్యాంటీన్ ప్రారంభం

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమైందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ గ్రామంలో శాసనసభ్యురాలు రోజా, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు నకు ప్రారంభోత్సవం , ఇతర సిమెంటు రోడ్డు పనులకు భూమిపూజ కార్యక్రమం అంగన్వాడి భవనానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..మహిళల సమస్యలపై ఎమ్మెల్యే రోజా అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా..నియోజకవర్గంలో రోజా చేసిన అభివృద్ధి ప్రశంసనీయమన్నారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని, వైయస్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువచ్చి మన బతుకులు మార్చుకుందామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్ సీఎం కావడం తధ్యమని దీమా వ్యక్తం చేశారు.