రైతు పక్షపాతి వైయస్ఆర్: మేకపాటి

వింజమూరు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షపాతిగా వ్యవహరించారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా తొలి సంతకం రైతు సంక్షేమంతో ప్రారంభించారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ఉద్భవించిన వైయస్ఆర్‌ సీపీ పక్షాన రైతులు నిలబడి, రానున్న సహకార ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కోరారు.  వైయస్ఆర్ హయాంలో రైతులు రారాజుగా బతికారన్నారు. రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఏడు గంటల విద్యుత్తు సరఫరా, పావలా వడ్డీ రుణాలు, ఇన్‌ఫుట్ సబ్సిడీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపరిహారం అందించి రైతుల్ని ఆదుకున్నారన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధరను పెంచి మార్కెట్‌లోనూ గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేశారన్నారు. ఆ సంక్షేమ ఫలాలు రైతులకు అందాలంటే రైతులంతా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎరువుల ధరలు, కరెంటు చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాజన్న రాజ్యం, రైతులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.

Back to Top