రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యం

జగ్గంపేట:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డిని సీఎం చేసుకోగలిగితేనే రాజన్న రాజ్యం వస్తుందని పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని మామిడాడకు చెందిన దాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన దివంగత మహానేత డాక్టర్ వైయస్  రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జ్యోతుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రాజకీయాలకు అసలు సిసలైన నిర్వచనం దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని కొనియాడారు. మహానేత మరణానంతరం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు డాక్టర్ రాజశేఖరరెడ్డి రూ. 132 కోట్లు కేటాయించి శంకుస్థాపన కూడా చేశారన్నారు. వాటికి ఆధునికీకరణ చేపడితే క్రెడిట్ దక్కదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో నెలకొల్పేందుకు సిద్ధం చేసిన పవర్‌ప్లాంట్లు పూర్తయ్యేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తేవాల్సి వుందన్నారు. అలాగయితేనే విద్యుత్తు సమస్య తీరే అవకాశం ఉందన్నారు.

Back to Top