రాజన్నరాజ్యం జగనన్నతోనే సాధ్యం

బాలానగర్:

జగనన్నతోనే రాజన్నరాజ్యం సాధ్యమనీ, దివంగత మహానేత డాక్టర్ వైయస్ సంక్షేమ పథకాలు అమలవుతాయనీ వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు అనిరుధ్‌రెడ్డి చెప్పారు. ఆ పాలన కోసం రాష్ట్రప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి, చింతకుంటతండా, ఎర్రకుంటతండాలకు చెందిన 200 మంది కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు అనిరుధ్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ పేదల కోసం ఎన్నో సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి వారి గుండెల్లో గూడుకట్టుకున్నారని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top