<strong>నల్గొండ :</strong> మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జననేత శ్రీ జగనన్నకే సాధ్యం అని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సంకినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా భానుపురికి చెందిన టిడిపి నుంచి వంద మంది కార్యకర్తలు మంగళవారంనాడు వైయస్ఆర్‌సిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి సంకినేని వైయస్‌ఆర్‌సిపి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడారు.<br/>రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వపాలన ఉందా లేదా అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతున్నదని సంకినేని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించారని అన్నారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డితోనే రాజన్న పాలన సాధ్యమవుతుందని భావిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా శ్రీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.