రాజకీయ కక్ష.. జగన్‌కు వ్యతిరేకంగా ముఠా

మన దేశంలో న్యాయం అందరికీ సమానంగా.. నిష్పక్షపాతంగా అందుతోందా? అధికారంలో ఉన్న(సోనియా/సీబీఐ), శక్తిమంతమైన ఎల్లో మీడియా(ఈనాడు/ఆంధ్రజ్యోతి/టీవీ9), అధికారంలోకి ఎలా రావాలా అనే నిరంతర వార్తాస్రవంతిలో కాలం గడిపే ప్రతిపక్ష నేత చంద్రబాబు లకు ప్రజాసమస్యలు పట్టించుకునే వ్యవధి లేదు. కానీ, తాము ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనలేని శక్తిగా ఎదిగిన వ్యక్తి(జగన్)కి న్యాయపరమైన చిక్కులు కల్పిస్తూ ఇక్కట్లు పెడుతున్నారు. ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేమనే అంశం ఇప్పటికే మూడుసార్లు రుజువైంది. తొలుత కడప ఎంపీ స్థానానికీ, తదుపరి కోవూరు అసెంబ్లీ సీటుకూ, అనంతరం 18స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఓట్లు చూసి వారు బెంబేలెత్తారు.

జగన్‌ను ఎదుర్కొనలేక, కేసులు రుజువు కావని తెలిసి, ఆయనకు బెయిలు లభించకుండా చేయడానికి ఈ మూడు శక్తులూ కంకణం కట్టుకున్నాయి. అంటకాగుతున్న అంటరాని శక్తులైన కాంగ్రెస్(వచ్చే ఎన్నికలలో ఈ పార్టీకి వంద సీట్లు రావడం కూడా గగనమే), దినదినానికి పాఠకులు తగ్గిపోతున్నఎల్లో మీడియా, విజయావకాశాలే లేని చంద్రబాబు జగన్‌తో పోటీపడటం కష్టసాధ్యమే.  సీబీఐ కట్టల కొద్దీ దాఖలు చేసిన చార్జిషీట్లు, జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు వినేముందు చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇతరత్రా వార్తాంశాలు, ఎల్లోమీడియా ఆరోపణలు బెయిలు అంశంలో సీబీఐ లేదా కోర్టులను ప్రభావితం చేయగలవా అంటే అవుననే చెప్పకతప్పదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా చేసి, సాధ్యమైనంత కాలం కటకటాల్లో ఉంచాలనేందుకే వాటిని ఉద్దేశించినవన్నది సుస్పష్టం.
జగన్‌కు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదిస్తోంది. దీనికి మద్దతుగా ఒక్క ఉదంతాన్ని కూడా చూపలేకపోతోందనేది కూడా అంతే నిజం. సోనియా, టీడీపీ, సీబీఐ, ఎల్లో మీడియాలు బాహాటంగా కుమ్మక్కయిన విషయం అందరికీ స్పష్టమైపోయింది. ఈడీ జగన్ ఆస్తులను అటాచ్ చేస్తుందన్న యెల్లో మీడియా అంచనా గురువారం నిజమైంది. కాంగ్రెస్ పార్టీకీ, సీబీఐకి అది కృతజ్ఙతాపూర్వకంగా ఉండాలి ఎందుకంటే.. జగన్ కేసుకు సంబంధించిన ప్రతి అంశం నేరుగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నుంచే అందింది. ఆయన సెల్‌ఫోన్ కాల్ లిస్టు ఇదే వాస్తవాన్ని వెల్లడించింది. 

అనైతికంగా ఫోన్లు చేసిన జేడీని విడిచి, ఈ కాల్ లిస్టును వెలికితీసిన వ్యక్తులపై సీబీఐ కేసులు పెట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారంలో మీడియాపై దాడి ఇదని గొంతెత్తి నిరసన తెలిపిన సీపీఐ, సీపీఎమ్, లోక్‌సత్తా పార్టీలు సాక్షి, జగన్ కు సంబంధించిన సంస్థలపై సీబీఐ దాడులు చేసినపుడు నోరు మెదపక పోవడం వెనుక వారి ఉద్దేశాలు బయటపడ్డాయి.  ఇలాంటి శక్తులన్నీ కలిసి జగన్‌ను రాజకీయంగా సమాధి చేయాలనీ, మహానేత వైయస్ఆర్  ముద్రను చెరిపేయాలనీ కుట్ర పన్నాయి. సీబీఐ, ఈడీ వ్యవస్థలు న్యాయ వ్యవస్థతో కుమ్మక్కయ్యి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్నే వీరి చర్యలు ప్రశ్నిస్తున్నాయి. వెనుదిరిగి చూసుకునే అవకాశం కూడా ఇప్పుడు లేకుండా పోయిందనే విషయాన్ని గమనించాల్సి ఉంది. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యి కొద్ది సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు కారణంగా స్వతంత్ర సంస్థలు విశ్వసనీయతనూ, న్యాయ వ్యవస్థ గౌరవాన్నీ  దెబ్బతీస్తున్నాయి. గతంలో దొంగాటలు తెరవెనుక ఆడేవారు. ఇప్పుడు సిగ్గువిడిచి బాహాటంగానే అంటకాగుతూ వ్యవహరిస్తున్నాయి.  ప్రభుత్వంలో ఏ రకంగానూ భాగం కాని జగన్‌ను సీబీఐ అరెస్టు చేసి, బెయిలుకు అవకాశమీయకుండా జైలులో ఉంచడానికి సీబీఐ తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఎన్నో కుంభకోణాలకు ఆద్యుడైన చంద్రబాబు మాత్రం అధికారాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారు. సాహసోపేతమైన పులిని పంజరంలో బంధించబడి ఉంటే... కపటమైన పిల్లి చలన చిత్రాల దర్శకుల దర్శకత్వంలో కాలినడక మొదలుపెట్టారు. 
ఈ దుష్ట కలయికతో కాంగ్రెస్, టీడీపీలు మన ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికి తీసుకెడుతున్నాయి. తనను తాను పిచ్చి కుక్కగా అభివర్ణించుకున్న డాక్టర్ శంకరరావు సోనియా ఆదేశంతో జగన్ అవినీతిపై సీబీఐతో పూర్తిస్థాయి విచారణ చేయించాలని హైకోర్టుకు రెండు పేజీల లేఖ రాశారు.  ఆ రకంగా చేసినందుకు శంకరరావుకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది. చంద్రబాబు చేసిన అవినీతిపై పూర్తి సాక్ష్యాధారాలతో రెండు వేల పేజీల పిటిషనును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైకోర్టుకు సమర్పిస్తే నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. సోనియాతో కుమ్మక్కయ్యిన చంద్రబాబు మాత్రం హాయిగా ఉన్నారు.
 
ఇదేనా సహజ న్యాయం. దీనిని ఎవరూ కచ్చితంగా అంగీకరించరు. సోనియా ప్రజాస్వామ్య విలువలను హేళన చేశారు. ఆంటనియా ఎడ్విగ్ ఆల్బినా మైనో(సోనియా) ఆధునిక జయచంద్రుడిగా రూపుదాల్చిన చంద్రబాబుతో కలిసి జగన్‌పై దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏలేది తానేనని చంద్రబాబు భ్రమిస్తున్నారు. ప్రజలు అమాయకులు కారు. కీలెరిగి వాత పెడతారు. వారికి తగిన గుణపాఠం చెప్పడానికి వారు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.  
- గురవారెడ్డి(reddy.gurava@yahoo.com)

Back to Top