ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు:షర్మిల

బింగిదొడ్డి (మహబూబ్ నగర్ జిల్లా): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ర్టంలో గుడిసెలు లేకుండా చేస్తారని ఆయన సోదరి, దివంగత మహానేత తనయ షర్మిల అన్నారు. గుడిసెల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాలోని బింగిదొడ్డిలో తన 40వ రోజు పాదయాత్రను ప్రారంభించిన షర్మిల గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. రాష్ర్టంలో పాలన అటకెక్కిందని ఆమె ధ్వజమెత్తారు. నిరుపేదలు ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం కొనసాగుతోందని మండిపడ్డారు.

     వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 45 లక్షల పక్కా గృహాలు కట్టించి ఇచ్చారని షర్మిల తెలిపారు.  పేదలు తినడానికి సరిపోను 30 కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇప్పించే ఏర్పాట్లు చేశారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. కానీ ఈ పాలకులు నిరు పేదలను పట్టించుకోవడంలేదన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అటకెక్కాయని అన్నారు. రాష్ర్టంలో విద్యుత్ సమస్య ఏర్పడటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన విధానాలే కారణమని ఆమె విమర్శించారు.

     జగనన్న జైలు నుంచి బయటకు వస్తే మళ్లీ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తారని, పింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచుతారని షర్మిల హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలను విస్మరిస్తున్న ఇతర పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.

Back to Top